నిన్న రాత్రితో బిగ్ బాస్ సీజన్-8 విన్నర్‌ని తేల్చే ఓటింగ్ ముగిసింది. ఆదివారం రాత్రి నుంచి ప్రారంభమైన బిగ్ బాస్ చివరి వారం ఓటింగ్ శుక్రవారం రాత్రితో క్లోజ్ అయ్యింది. మొత్తం 5 ఫైనలిస్ట్‌ల మధ్య ఈ ఓటింగ్‌లో ఇద్దరి మధ్యే ప్రధానమైన పోటీ ఉంది. నిఖిల్ వర్సెస్ గౌతమ్‌ల మధ్య టైటిల్ పోరు రసవత్తరంగా సాగింది. మొత్తం ఓటింగ్‌లో ఈ ఇద్దరిదే పైచేయి.
అన్ లిమిటెడ్ ఫన్ గా మొదలైన ఈ సీజన్-8 క్లైమాక్స్ చేరుకుంది. మరో రెండు రోజుల్లో ఈ సీజన్ ముగియనుంది. 16 మంది ఓజీ క్లాన్.. 05 మంది రాయల్ క్లాన్ సభ్యులతో మొత్తం 22 మంది ఈ సీజన్లో కంటెస్టెంట్స్‌గా పాల్గొని టైటిల్ కోసం పోటీ పడ్డారు. అయితే ఐదోవారం వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రావడంతో సీజన్ 8 ఊపందుకుంది. నిఖిల్, నబీల్, గౌతమ్, ప్రేరణ, అవినాష్ సీజన్-8 టాప్-5 ఫైనలిస్ట్ లుగా నిలిచారు. ఇక ఈ అయిదుగురికి గత ఆదివారం నుండి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అవ్వగా.. 80 శాతం ఓటింగ్ టైటిల్ రేస్‌లో ఉన్న ఉన్న నిఖిల్, గౌతమ్ ఇద్దరికే పడ్డాయి. మిగిలిన 20 పర్సంట్ ఓటింగ్‌ని నబీల్, ప్రేరణ, అవినాష్‌లు పంచుకున్నారు. పోటీలో నామమాత్రంగా మిగిలిపోయారు. తొలిరోజు నుంచి ఐదోరోజు వరకూ కూడా ఈ ముగ్గురి స్థానాల్లో ఎలాంటి మార్పు లేదు కానీ.. టైటిల్ రేస్‌లో ఉన్న నిఖిల్, గౌతమ్‌లు స్థానాలు తారుమారయ్యాయి.
బిగ్ బాస్ తెలుగు ఓటింగ్ ఆన్ లైన్ పోల్స్ శుక్రవారం అర్ధరాత్రి ముగిసేసరికి చూస్తే.. గౌతమ్ 38 శాతం ఓటింగ్‌తో టాప్‌లో ఉన్నాడు. గౌతమ్‌కి 1,18,264 ఓట్లు పడ్డాయి. నిఖిల్‌కి 33 శాతం ఓట్లు పడ్డాయి. అతనికి 1,03,972 ఓట్లు పడ్డాయి. వీళ్లిద్దరి మధ్య కేవలం ఐదు శాతం ఓట్లు మాత్రమే తేడా ఉంది. ఇక మూడో స్థానంలో 16 శాతం ఓటింగ్‌తో నబీల్ ఉన్నాడు. ఇతనికి 51,461 ఓట్లు పడ్డాయి. ఇక ప్రేరణ, అవినాష్‌లు సింగిల్ డిజిట్‌కి పరిమితం అయ్యారు. ప్రేరణకి 9 శాతం ఓట్లు పడితే.. అవినాష్‌కి 4 శాతం ఓట్లు పడ్డాయి. ఆటల పరంగా నిఖిల్ టాప్ లో ఉండగా.. రెండు తెలుగు రాష్ట్రాలలో గౌతమ్ కి ఫ్యాన్ బేస్ బాగుంది. గౌతమ్, నిఖిల్ ఈ ఇద్దరిలోనే విన్నర్, రన్నర్ ఉన్నారు. మూడో స్థానంలో నబీల్, నాలుగో స్థానంలో ప్రేరణ, ఐదో స్థానంలో అవినాష్‌లు నిలిచే అవకాశం ఉంది. మరికొన్ని గంటల్లో విన్నర్ ఎవరో తెలియబోతుండటంతో బిబి ఆడియన్స్ విజేత ఎవరా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.